వైఎస్సార్ ఓ చరిత్ర.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదే?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారనే సంగతి తెలిసిందే. వైఎస్సార్ మొదలుపెట్టిన ఎన్నో పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఆయన పథకాలు ఉండేవి . అయితే ఒక సందర్భంలో బాలకృష్ణ వైఎస్సార్ గురించి మాట్లాడుతూ వైఎస్సార్ ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ అని ఆయన వెల్లడించారు. వజ్రోత్సవ వేడుకలు జరిగే సమయంలో చిరంజీవి, మోహన్ బాబు నేను లెజెండ్ అంటే నేను లెజెండ్ అంటూ పోట్లాడుకున్నారని అయితే అలా ఎందుకు చేశారో నాకు, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశేఖర్ రెడ్డికి అర్థం కాలేదని బాలకృష్ణ వెల్లడించారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీఏను పిలిచి అక్కడినుంచి వెళ్లిపోదామని చెప్పారని బాలయ్య తెలిపారు.

ఆ సమయంలో వైఎస్సార్ పీఏ బాలకృష్ణకు సన్మానం చేసి వెళ్లాలని చెప్పగా బాలయ్య అంటే పెద్దాయన అబ్బాయి అని ఆయనకు సన్మానం చేయడం మన కర్తవ్యం అని అన్నారని బాలయ్య బాబు వెల్లడించారు. కొంత సమయం పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేచి ఉండి తనకు సన్మానం చేసి వెళ్లారని బాలయ్య బాబు అన్నారు. వైఎస్సార్ చరిత్రలో ఒక పేజీని లిఖించుకున్నారని బాలయ్య కామెంట్లు చేశారు.

బాలయ్య రెండేళ్ల క్రితం ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు. బాలయ్య, వైఎస్సార్ పార్టీల పరంగా వేరు అయినా బాలయ్య వైఎస్సార్ గురించి గొప్పగా చెప్పడం గమనార్హం. బాలయ్యకు సీఎం జగన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. కడప జిల్లా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ కు జగన్ కొంతకాలం పాటు అధ్యక్షునిగా ఉన్నారని గతంలో కొన్ని పేపర్ కటింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.