నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈయన నటించిన ప్రతి సినిమాలోని తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన అఖండ సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ ఆ సినిమా ద్వారా కరోనా సమయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
గత ఏడాది ఆహా లో స్ట్రీమ్ అయిన అన్ స్టాపబుల్ సీజన్1 ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ షోలో బాలకృష్ణ హోస్ట్ గా ప్రేక్షకులని బాగా అలరించారు. దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ఆశ నెరవేరుతోంది. తొందరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం కానున్నట్టు ఆహా యాజమాన్యం వారు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ షో కోసం బాలకృష్ణ తీసుకొనే రెమ్యూనరేషన్ గురించి చర్చ మొదలయ్యింది.
అన్ స్టాపబుల్ సీజన్1 కోసం బాలకృష్ణ కోటి రూపాయల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.
అయితే అన్ స్టాపబుల్ సీజన్2 కోసం బాలకృష్ణ ఒక్క ఎపిసోడ్ కోసం 25 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ ప్రకారం 12 ఎపిసోడ్స్ కి మొత్తం 3 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోనున్నాడు. కానీ ఒక్క సినిమా కోసం బాలకృష్ణ తీసుకొనే పారితోషికంతో పోల్చితే ఇది చాలా తక్కువ. బాలకృష్ణ ఒక్కో సినిమాకి దాదాపు 12 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. అల్లు అరవింద్ గారి తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల బాలకృష్ణ ఈ షో తక్కువ రెమ్యూనరేషన్ కి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.