Balakrishna: పద్మభూషణ్ అవార్డుపై స్పందించిన బాలయ్య…. రుణపడి ఉంటా అంటూ ఎమోషనల్?

Balakrishna: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న సాయంత్రం పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పద్మ అవార్డుల జాబితాలో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న నటుడు నందమూరి బాలకృష్ణ పేరు కూడా ఉండటం విశేషం. ఇలా బాలయ్య పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక కావడంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కుటుంబ సభ్యులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ విధంగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఈయన మొదటిసారి ఈ అవార్డును గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ముందుగా తనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఈయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈయనకు పద్మ అవార్డు రావడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభినందనలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోని తనకు అభినందనలు తెలిపిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు కూడా ఈయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడే కాకుండా తన వెంటే ఉంటూ తనను ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఇక తనతోపాటు పద్మ అవార్డు అందుకున్న ఇతరులందరికీ కూడా ఈయన అభినందనలను తెలియజేశారు.