Balakrishana: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమ మధ్య టికెట్ల విషయంపై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని సినిమా రేట్లను తగ్గించడం తో సినీ పరిశ్రమ ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా టికెట్ల వ్యవహారం పై పలువురు హీరోలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ల వ్యవహారం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా సినీ నటుడిగా, ఎమ్మెల్యేగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణ అఖండ సినిమా విజయవంతం కావడంతో అఖండ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ బాలకృష్ణకు సినిమా టికెట్లు గురించి ప్రశ్నలు అడగటంతో ఈ విషయంపై బాలకృష్ణ స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు. ఏ సినిమా నష్టపోయిన నిర్మాతలు నష్టపోతారు సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి అంటూ మాట్లాడారు. అదేవిధంగా ఇది కేవలం నా ఒక్కడి నిర్ణయం కాదు ఇండస్ట్రీలో అందరూ కూర్చుని ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించుకోవాలి అనంతరం ఆ సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలి. సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చేది కనుక తప్పకుండా ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని బాలకృష్ణ ఈ సందర్భంగా టికెట్ల వ్యవహారంపై స్పందించారు.