Balakrishna: నటుడిగా, నాయకుడిగా, హోస్ట్ గా సక్సెస్ అయిన బాలయ్య ఆ విషయంలో ఫెయిల్యూర్?

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టారు కానీ ఏ ఒక్కరు మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక బాలయ్య నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తన తండ్రి బాటలోనే ఈయన రాజకీయాలలోకి కూడా అడుగు పెట్టారు. రాజకీయాలలో కూడా ఈయనకు ఎదురు లేకుండా పోయింది.

హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన బాలయ్య మూడు సార్లు అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకున్నారు.. ఇకపోతే బాలయ్య కెరియర్ విషయానికి వస్తే ఇటు సినిమాలలోనూ నటుడుగా గుర్తింపు పొందారు రాజకీయాలలోనూ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల అనుస్థాపబుల్ కార్యక్రమం ద్వారా హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య తన మాట తీరుతో ప్రేక్షకులందరిని ఆకట్టుకొని ఇక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. ఇలా అన్ని రంగాలలో సక్సెస్ సాధించిన ఈయన ఒక విషయంలో మాత్రం ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారని చెప్పాలి.

బాలకృష్ణ తన సినీ కెరియర్ లో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే ఎన్బికె ఫిలిమ్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన బాలకృష్ణ తన నిర్మాణంలో తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తీశారు. ఇలా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా బాలయ్య నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ కావడం బాలకృష్ణ నిర్మాతగా ఫెయిల్యూర్ అయ్యారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా మాత్రమే కాకుండా గతంలో సుల్తాన్ అనే సినిమాకి కూడా ఈయన సహ నిర్మాతగా పనిచేశారు. ఆ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాలయ్య నిర్మాతగా తన కెరీర్లో ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి.