Balakrishana: ఛీఛీ బాలయ్య.. ఎంత ముద్దొస్తే మాత్రం థమన్ పొట్టపై నువ్వెలా ముద్దుపెట్టావ్?

Balakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వెండితెరపై హీరోగా సందడి చేయడమే కాకుండా, ఇటు ఆహా ఓటీటీ లో కూడా అన్ స్టాపబుల్ అనే టాప్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మొదట్లో ఈ కార్యక్రమాన్ని బాలయ్య చేయబోతున్నారని వెల్లడించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే బాలయ్య కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తక్కువేమీ కాదని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించారు.ఇక పోతే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి ఈ కార్యక్రమం ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు నేచురల్ స్టార్ నాని బ్రహ్మానందం డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చారు. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విజయం కావడంతో అఖండ చిత్ర బృందాన్ని కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ హాజరయ్యారు.

ఇక వీరి అందరితో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించిన బాలకృష్ణ ఈ కార్యక్రమంలోకి తమన్ ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా తన పొట్ట పై ముద్దు పెట్టాడు.అసలు తమన్ పొట్ట పై బాలకృష్ణ ముద్దు పెట్టడానికి కారణం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోగా అందుకు కారణాన్ని బాలకృష్ణ వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను నటించిన అఖండ సినిమా విజయవంతం కావడానికి తమన్ సంగీతం కూడా కీలక పాత్ర పోషించిందని అందుకే తన పొట్ట పై ముద్దు పెట్టానని తెలిపారు. బాలకృష్ణ ఇలా ఒక్కసారిగా ముద్దు పెట్టడంతో అందరూ ఇదేంటి బాలయ్య అలా ముద్దు పెట్టావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.