Sammeta Ghandhi: బాలయ్య దగ్గరికి వెళ్లొద్దు ఆయనకు కోపం ఎక్కువ అని భయపెట్టారు: సమ్మెట గాంధీ

Sammeta Ghandhi: నందమూరి బాలకృష్ణ మూములుగానే చాలా గంభీరంగా ఉంటారని, కోపమెక్కువ అని బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారని, తాము వెళ్లినపుడు కూడా అందరూ అలానే అన్నారని ఆర్టిస్ట్ సమ్మెట గాంధీ చెప్పారు. ఆయనకు ఎదురుగా వెళ్లొద్దు, నమస్కారం పెట్టొద్దు అని చెప్పారని, కానీ తాను మాత్రం అలా ఏం ఉండదని భావించి వెళ్లిన మొదటి రోజే బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్లి నమస్కారం చేశానని ఆయన చెప్పుకొచ్చారు. దానికి ఆయన కూడా నమస్కారం అండీ, బాగున్నారా అని కూడా అన్నారని ఆయన తెలిపారు. ఆయనతో కలిసి దాదాపు 12రోజులు కలిసి పనిచేశానని, రోజూ నమస్కారం చెప్పేవారని సమ్మెట గాంధీ చెప్పారు. తాను ఆయనతో తీసిన వాటిల్లో కొన్ని సీన్లు కట్ అయ్యానని, కొన్ని మాత్రమే సినిమాలో చూపించారని ఆయన తెలిపారు. షూటింగ్ చేస్తున్నపుడు కూడా తనకు చిన్న చిన్న సలహాలు ఇచ్చేవారని, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేవారని ఆయన అన్నారు. చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంటారని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఒక్క మాటలో చెప్పాలంటే బాలకృష్ణ మంచి మనసున్న వ్యక్తి అని సమ్మెట గాంధీ అన్నారు. ఎలాంటి కల్మశం లేని వ్యక్తి ఆయన అని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు సమ్మెట గాంధీ. ప్రెస్‌మీట్‌లో కూడా ఆయనకు ఇష్టం అని ఒక పద్యం కూడా పాడానని గాంధీ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు పద్యాలు ఇష్టం అని తెలిసి, బోయపాటి శ్రీను గారు తనకు అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. తాను పాడిన పద్యం బాలకృష్ణ గారికి కూడా వచ్చని, ఆయన కూడా గొంతు కలిపారని సమ్మెట గాంధీ అన్నారు.

ఇక మరో సారి ఆయన సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ గారు పంచె కట్టుకొని వచ్చారని, అది చూసి తాను సినారె రాసిన ఒక పద్యం పాడి వినిపించానని సమ్మెట గాంధీ చెప్పారు. దాంతో జనాలంతా బాగా చప్పట్లు కొట్టారని, అందులో బాలయ్య గారు, బోయపాటి గారు కూడా ఉండడం తనకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలా ఆ రోజు తాను పద్యాలు పాడడం తనకు మంచి పేరును తీసుకొచ్చాయని, అవి ఇప్పటికీ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ను పొందాయని ఆయన చెప్పారు. ఇప్పటికీ కూడా ఆ పద్యాలు బాగా పాడారంటూ తనకు ఫోన్లు చేస్తుంటారని ఆయన తెలిపారు.