Poojitha: ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన పూజిత తనకు దాదాపు అందరు హీరోలూ నచ్చుతారని, అందరితోనూ మంచి సంబంధాలు కూడా ఉన్నాయని నటి పూజిత అన్నారు. వారిలో రామ్ చరణ్ రంగస్థలంలో చేసిన పాత్ర తనకు చాలా నచ్చుతుందని, ప్రభాస్ కూడా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని, ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే యాక్టింగ్ అనేది ఆయన నరనరంలో ఉందని ఆమె చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా బాగా నచ్చుతారన్న ఆమె, స్టైలిష్‌గా ఉంటారనే కాదు చాలా అన్ని విషయాల్లోనూ ఆయన బాగా ఎంటర్‌టైన్ చేస్తారని పూజిత చెప్పారు.
ఇక ఈ మధ్య తానొక సినిమా చూశానని, అదే బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ అని ఆమె అన్నారు. ప్రస్తుతం యూత్ అంతా కొన్నిసార్లు బాలకృష్ణను ఒక జోకర్‌గా వాడుకుంటారని ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో గొప్ప సినిమాలు, హిట్‌లు సాధించిన బాలకృష్ణను ఒకప్పుడు మెచ్చుకున్నారు కదా. అలాంటి వ్యక్తిని సడన్‌గా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు ? అది కూడా చాలా దారుణంగా చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
కొందరు స్టూడెంట్స్ అలా తన ముందే అలా చేస్తే మీరు చదువుకోవడానికి వచ్చారా ? లేదంటే ఇలా కామెంట్ చేయడానికి వచ్చారా ? ఆయన గురించి మీకేం తెలుసు ? అని తిడతానని ఆమె అన్నారు. ఒక ఆర్టిస్ట్‌గా చెప్పాలంటే ఆయనా యాక్టరే.. తను కూడా ఒక యాక్టరేనని, ఫస్ట్ రైటర్ రాస్తాడు, డైరెక్టర్ ఇలా చేయమని చెప్తాడు, ప్రొడ్యూసర్ ఫైనాన్స్ చేస్తాడు. ఆర్టిస్ట్ ఏం చెప్తే అది చేస్తారని ఆమె అన్నారు. అవేమీ బాలకృష్ణ సొంతంగా రాసుకున్న కథలేమీ కాదని, ఇలా కొడితే అలా ఎగరాలి అని ఆయనేమీ చెప్పట్లేదని ఆమె అన్నారు. ఏదో ఒక సినిమాలో అలా పండింది కాబట్టి, అలా వివిధ రకాలుగా తీస్తున్నారని, అయినా ఒకసారి ప్రేక్షకులకు నచ్చిందనే కదా మళ్లీ అలాంటి కథలు రాస్తున్నారు తప్ప ఆయనతో ఆడుకుంటున్నారెందుకు ? ఆయన వయసెంత ? మీ వయసెంత ? అని పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాంటి వారికి తాను చెప్పేది ఒక్కటేనని, కాసేపు మీరు ఆగండి అని బాలకృష్ణ గారిని ఆపుతా, ఆ రోల్ మీరు చేయండి మేం చూస్తామని వాళ్లకు చెప్తానని పూజిత సమాధానమిచ్చారు. కాబట్టి మాట్లాడేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా మాట్లాడండి అని ఆమె ఓ మాదిరిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. వాటన్నింటికీ సమాధానమే అఖండ సినిమా అని మరోసారి బాలకృష్ణ గురించి గొప్పగా చెప్పారు నటి పూజిత.