Balakrishna: సింహం సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న బాలకృష్ణ… కొత్త సినిమా టైటిల్ ఇదే!

Balakrishna: ఇటీవల విడుదలైన అఖండ సినిమా ద్వారా మంచి విజయం అందుకున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఎంతో కాలంగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలన్న తన కోరిక నెరవేరబోతుందని ఇటీవల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కరోనా సమయంలో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు బద్దలు కొట్టింది. ప్రస్తుతం గోపీచంద్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా ఈ రేంజిలో ఉంటుందని సమాచారం.

బాలకృష్ణ, గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇటీవల షూటింగ్ పనులు మొదలు పెట్టింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శ్రుతిహాసన్ నటించబోతోంది. ఈ సినిమా టైటిల్ గురించి కొన్ని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ సినిమాలకు దాదాపు టైటిల్స్ అన్నీ కూడా చాలా పవర్ ఫుల్ గానే ఉంటాయి. బాలయ్య బాబు నటించిన సినిమాలకు సింహ అనే పదం టైటిల్స్ లో ఉన్న సినిమాలు అన్ని దాదాపు మంచి విజయం సొంతం చేసుకున్నాయి. ఆ సెంటిమెంట్ వల్ల గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ఖరారు చేశారని సినీ వర్గాలలో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్న పాత్ర పేరు కూడా వీర సింహారెడ్డి అని సమాచారం. అయితే ఈ కొత్త సినిమా టైటిల్ గురించి వినిపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే మూవీ మేకర్స్ ఈ విషయం గురించి స్పందించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సినిమా కన్నడ సినిమా కి రీమేక్ గా చేస్తున్నారన్న వార్తలను సినిమా యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల బాలయ్య నటించబోయే పాత్రకు సంబంధించిన కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ఇది. బాలకృష్ణ సైతం ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.