Balakrishana: సినీ నటుడు బాలకృష్ణ వివాదంలో నిలిచారు. ఆయన ఏ విషయం అయినా చాలా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఇలా మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంతోనే ఈయన వివాదాలలో నిలుస్తూ ఉంటారని చెప్పాలి. తాజాగా బాలకృష్ణ తన స్వగ్రామంలో పర్యటన చేశారు. బాలయ్య తాజాగా నిమ్మకూరులో పర్యటన చేయడమే కాకుండా తన తల్లితండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు కూడా అర్పించారు అనంతరం గ్రామస్తులతో కలిసి తన గ్రామంలో పర్యటించి అక్కడ విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఇలా బాలకృష్ణ నిమ్మకూరులో పర్యటన చేస్తున్నారనే విషయం తెలుసుకున్నటువంటి కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కలిశారు. కొమరవోలు స్వయంగా బాలకృష్ణ తల్లిగారైన బసవతారకం గారి సొంత ఊరు. ఈ క్రమంలోనే కొమరవోలు గ్రామస్తులు కొందరు బాలకృష్ణతో మాట్లాడుతూ ఒకసారి మీరు మా గ్రామానికి వచ్చి అక్కడ కూడా పర్యటన చేయాలని కోరారు దీంతో ఒక్కసారిగా బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొమరవోలా… అది ఎక్కడ అయినా మేము ఆ ఊరికి ఈ జన్మలో రాము అక్కడివారిని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు అంటూ బాలకృష్ణ మాట్లాడారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు మారుమూల గ్రామంలో కూడా పర్యటిస్తూ అంత నా వాళ్లే అంటూ గొప్పలు చెప్పుకునే రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదంటూ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అంటూ బాలకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన ఇలాంటి మాటలు మాట్లాడటం సరైనది కాదు అంటూ విమర్శలు చేస్తున్నారు.