Akhanda2: వామ్మో.. అఖండ 2 కోసం బాలయ్య బాబు ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకుంటున్నారా!

Akhanda2: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదల అయినా డాకు మహారాజు మూవీతో వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు. ఇప్పుడు గతంలో విడుదల అయినా అఖండ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న అఖండ 2 మూవీలో నటిస్తున్నారు. గతంలో విడుదల అయిన అఖండ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత బాలయ్య బాబుకు అదృష్టం కలిసి వచ్చింది. అఖండ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు బాలయ్య.

ఇకపోతే అఖండ 2 సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఇందులో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు బాలయ్య బాబు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తాండవం చేయడానికి రెడీ అవుతున్నారు బాలయ్య బాబు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు బాలయ్య బాబు ఎంత పారితోషికం తీసుకోబోతున్నారు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. అఖండ 2 చిత్రంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో అఘోరా పాత్ర కూడా ఉంది.

మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ ఫుల్ గా ఈ క్యారక్టర్ బోయపాటి డిజైన్ చేసినట్లుగా టాక్. ఇకపోతే ఈ అఖండ 2 సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా తన రెమ్యునరేషన్‌ను రూ.28 కోట్ల నుంచి ఏకంగా రూ.7 కోట్ల మేర పెంచినట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమాకు గాను బాలయ్య బాబు దాదాపుగా రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పెంచిన రెమ్యునరేషన్ నుంచే ఆయన థమన్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని బాలయ్య బాబు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.