Bhalakrishana- Gopichand Malineni: క్రాక్ డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ..!

Bhalakrishana- Gopichand Malineni: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉండటమే కాకుండా ఆహా ద్వారా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం కీరవాణి రాజమౌళి వంటి వారు హాజరయ్యే ఎన్నో విషయాలను ముచ్చటించారు. తాజాగా ఈ కార్యక్రమానికి రవితేజ డైరెక్టర్ గోపి చంద్ మలినేని వస్తున్నట్లు ప్రోమో ద్వారా వెల్లడించారు.

ఇక ఈ ప్రోమోలో భాగంగా ముందుగా రవితేజను ఆహ్వానించిన తర్వాత బాలకృష్ణ నీ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు గోపీచంద్ ను ఇన్వైట్ చేద్దామంటూ గోపీచంద్ మలినేని గ్రాండ్ గా ఇన్వెంట్ చేశారు. ఈ కార్యక్రమంలోకి వచ్చిన గోపీచంద్ బాలకృష్ణతో ఎంతో సరదాగా మాట్లాడారు. ఇక తనకు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే నీ సంగతి చెబుతా అంటూ గోపీచంద్ పొట్టపై కొడుతూ తనకు వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ తో మాట్లాడుతూ ఎప్పుడైనా జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురైందా అని అడగడంతో గోపీచంద్ మలినేని సమాధానం చెబుతూ అవును అది సమరసింహా రెడ్డి సినిమా విషయంలో జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ బలుపు, క్రాక్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి రవితేజకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. ఇక తాజాగా గోపీచంద్ మలినేని బాలకృష్ణతో వేటపాలెం అనే టైటిల్ తో సినిమా తీయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 20 వ తేదీ నుంచి షూటింగ్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.