కరోనా బారిన పడ్డ బాలయ్య… ఆందోళనలో బాలయ్య అభిమానులు?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ఆహా లో స్ట్రీమ్ కానున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులని అలరించనున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ అనారోగ్యం గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బాలకృష్ణ ఇటీవల కరోనా బారిన పడినట్లుగా ఆయనే స్వయంగా తెలియజేశారు. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షలలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో బాలకృష్ణ వెంటనే ఐసోలేషన్ లో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు.

ఈ క్రమంలో తన ఆరోగ్యం పరిస్థితుల గురించి తెలియచేశాడు. “నా ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. గత రెండు మూడు రోజుల్లో నన్ను కలిసినవారు తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి” అంటూ బాలకృష్ణ తెలియచేశారు. అయితే బాలకృష్ణ కరోనా బారిన పడ్డారని తెలియటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు .తమ అభిమాన హీరో కరోనా నుండి తొందరగా కోలుకోవాలని దేవుడికి ప్రార్ధనలు చేస్తున్నారు.ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది.

గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న బాలకృష్ణ 107 వ సినిమా దసరా కానుకగా విడుదల చేయాలని షూటింగ్ పనులు వేగంగా జరుపుతున్నారు. కానీ ప్రస్తుతం బాలకృష్ణ కరోనా బారిన పడటంతో షూటింగ్ కొంత కాలం నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడితో చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ కూడా పట్టా లెక్కనున్నట్లు సమాచారం.