Balakrishana: మరో దర్శకుడికి అవకాశం ఇచ్చిన బాలకృష్ణ… పదేళ్ల నిరీక్షణ నెరవేరేనా?

Balakrishana:నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అద్భుతమైన రికార్డులు సృష్టించడంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ మరొక దర్శకుడికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ హీరోగా లారీ డ్రైవర్, నరసింహ నాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇచ్చిన డైరెక్టర్ బి.గోపాల్ మరోసారి బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

గత పది సంవత్సరాల నుంచి ఈయన బాలకృష్ణతో సినిమా చేయాలని భావిస్తున్నప్పటికీ వీరిద్దరికీ సరైన కథ కుదరకపోవడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఒకానొక సమయంలో బి.గోపాల్ తో బాలకృష్ణ దగ్గరకు వెళితే ఆ కథ నచ్చకపోవటం వల్ల బాలకృష్ణ సినిమాను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే మరొక అద్భుతమైన కథతో తన దగ్గరికి రావాలని బాలకృష్ణ డైరెక్టర్ గోపాల్ కు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డైరెక్టర్ బి.గోపాల్ ఎలాగైనా బాలకృష్ణతో సినిమా చేయాలని కొంతమంది రైటర్స్ తో కలిసి స్క్రిప్ట్ కార్యక్రమాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈసారైనా ఈ కథ బాలకృష్ణకు నచ్చుతుందా.. డైరెక్టర్ బి.గోపాల్ 10 ఏళ్ల నిరీక్షణ నెరవేరుతుందా.. అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి బాలయ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. నేటి హీరోలకు పోటిగా సినిమాలలో నటిస్తున్నారని చెప్పవచ్చు.