Balakrishna: మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య…. ఆకట్టుకుంటున్న యాడ్ వీడియో!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం ఇప్పటివరకు సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలు క్రితం వరకు బాలయ్య ఎలాంటి యాడ్స్ కూడా చేయలేదు కానీ ఇటీవల కాలంలో ఈయన పెద్ద ఎత్తున పలు యాడ్స్ చేస్తూ కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న బాలకృష్ణ మొదటిసారి ఆహా వేదికగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ కావడంతో బాలయ్య పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలకృష్ణ గురించి గత కొద్ది రోజుల క్రితం తన చిన్నల్లుడు భరత్ ఓ విషయాన్ని వెల్లడించారు.

మావయ్య ఎక్కడికి వెళ్లిన ఒక బ్యాగ్ తనతో పాటు తీసుకు వెళుతుంటాడు అందులో ఆయన ఫేవరెట్ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ ఉంటుందని తెలిపారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాగ్ మాత్రం వెంట ఉండాల్సిందేనని భరత్ చెప్పడంతో అప్పటినుంచి మ్యాన్షన్ హౌస్ మరింత పాపులర్ అయింది అయితే ఇప్పటివరకు బాలయ్య నోట ఒక్కసారి కూడా మ్యాన్షన్ హౌస్ పేరు రాలేదు.

అన్ స్టాపబుల్ షోకి మ్యాన్షన్ హౌస్ అడ్వర్టైజింగ్ పార్ట్నర్ అయ్యింది ఆ సమయంలో మొదటిసారి బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ పేరు పలికారు. ఇప్పుడు ఏకంగా మ్యాన్షన్ హౌస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో వెల్ కమింగ్ సూన్ టు యువర్ ఫేవరెట్ హౌస్’ అంటూ మ్యాన్షన్ హౌస్ ఒక యాడ్ చేసింది. ఆ వీడియోలో ‘వన్స్ ఐ స్టెప్ ఇన్…’ (హిస్టరీ రిపీట్స్) అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు. అయితే బాలయ్య చేసింది మాత్రం మ్యాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ యాడ్ అని తెలుస్తుంది. ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బాలయ్య కూడా బిజీగా మారిపోతున్నారు.