Daaku Maharaaj: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫలించిన నిరీక్షణలు.. డాకు మహారాజ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Daaku Maharaaj: నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో వరుసగా నాలుగో సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ ల వర్షం కురిపించింది. శ్రద్ధా శ్రీనాద్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోస్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ కొల్లగొట్టింది. థియేటర్లో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు అభిమానుల ఆశలు ఎదురుచూపులు ఫలించాయి.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలయ్య కెరీర్ లో హయ్యేస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. ఈ సినిమా లోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందుకోసమే వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. మరి థియేటర్లో ఈ సినిమాను సక్సెస్ఫుల్ చేసిన అభిమానులు ఓటీటీలో ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి మరి.