Balakrishna – Mahesh Babu: మహేష్ బాబును ఆ కోరిక కోరిన బాలయ్య.. తీర్చ లేకపోయినా మహేష్.. ప్రోమో వైరల్!

Balakrishna – Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటు వెండి తెరపై మాత్రమే కాకుండా, డిజిటల్ మీడియాలో కూడా తన సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదటి సీజన్ నేటితో ముగియనుంది.ఈ కార్యక్రమానికి చివరి ఎపిసోడ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరుకానున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే వీటికి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. తాజాగా మరొక ప్రోమోని విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా మహేష్ బాబుని బాలయ్య ఒకే ఒక కోరిక అడిగారు. మహేష్ బాబు నోటిగుండా బాలకృష్ణ డైలాగ్ వినాలని బాలయ్య ఆశపడ్డారు. ఈ క్రమంలోనే మీరు నా డైలాగ్ ఒకసారి చెప్పండి అని అడిగినప్పటికీ మహేష్ బాబు మీ డైలాగ్ మీరు తప్ప మరెవరూ చెప్పలేరు అంటూ బాలకృష్ణ ప్రశ్నకు సమాధానం చెప్పారు. అదే విధంగా కెరీయర్ లో మూడు సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నను కూడా బాలకృష్ణ అడిగారు. ఆ సమయంలో నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ఆ గ్యాప్ తీసుకున్నాను అంటూ మహేష్ సమాధానం చెప్పారు.

ఇలా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు అంటూ మహేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మహేష్ బాబు నమ్రత పెళ్లి ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. అకేషన్ కి అని చెప్పి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చావు… ఏంటి సంగతి అని బాలకృష్ణ మహేష్ బాబు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు నవ్వుతూ ఉండిపోయారు. మరి ఈ ప్రశ్నకు మహేష్ బాబు ఏ సమాధానం చెప్పారో తెలియాలంటే ఈ రోజు రాత్రి 8 గంటల వరకు వేచి ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.