టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే రచయితకు లేని స్థాయిలో విజయేంద్ర ప్రసాద్ కు గుర్తింపు ఉంది. రాజమౌళి తండ్రి కావడంతో విజయేంద్ర ప్రసాద్ కు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. అయితే విజయేంద్ర కథ అందించి ఫ్లాపైన సినిమాలు లేవా అనే ప్రశ్నకు ఉన్నాయనే సమాధానం వినిపిస్తోంది. నందమూరి హీరోలకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ రచయిత కావడం గమనార్హం. ముళ్లపూడి వర డైరెక్షన్ లో నా అల్లుడు సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
బాలయ్య కెరీర్ లోని హిట్ సినిమాలైన బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి సినిమాలకు కథ అందించిన రచయిత కూడా విజయేంద్ర ప్రసాద్ కావడం గమనార్హం. అయితే ఈ రైటర్ కథ అందించి బాలయ్య హీరోగా రాజమౌళి శిష్యుడు మహదేవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిత్రుడు సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. నందమూరి హీరోలకు పలు కథలతో హిట్లు ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ పలు కథలతో ఫ్లాప్ ఇచ్చారు.
విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో శ్రీకృష్ణ2006, రాజన్న, శ్రీవల్లి సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి అయినా కొడుకు సూచనలు ఇస్తున్నా రాజమౌళి తండ్రి డైరెక్టర్ గా కెరీర్ విషయంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోకపోవడం గమనార్హం.