ఈ నెల 21 న సాయంత్రం 6:15కు ‘బేబీ’ సినిమా టీజర్ రిలీజ్.

హీరో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

సోమవారం చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు. తాజాగా టీజర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రోజ్ ఫ్లవర్ పెటల్స్ లో హీరోయిన్ వైష్ణవి వివిధ భావోద్వేగాలతో ఉన్నట్లు డిజైన్ చేశారు. ఈ పోస్టర్ డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతీ పోస్టర్ క్రియేటివ్ గా ఉండి సినిమా టీజర్ పై అంచనాలు పెంచాయి. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత: ఎస్. కే. ఎన్
నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్
రచన, దర్శకత్వం: సాయి రాజేష్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: విప్లవ్
ఆర్ట్: సురేష్
సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్
పీఆర్వో: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా
కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.