జమిలితో జిమ్మిక్కులు- బాబు సరికొత్త ఎత్తుగడ

chandrababu naidu telugu rajyam

 ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి వెంటిలేటర్ మీద చికిత్స చేస్తున్నారనే మాటలు గట్టిగ వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చెందటం, ఆ తర్వాత పార్టీ మీద నమ్మకం తగ్గటం, ముందుండి నడిపించే సరైన నేత కనిపించకపోవటంతో టీడీపీ క్యాడర్ లో అసహనం నెలకొన్న మాట వాస్తవం. దానిని అలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికీ పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారిపోతుందని చంద్రబాబు నాయుడు భావించి, ఎదో ఒక రూపంలో కార్యకర్తలను ఉత్తేజపరచాలరని చూస్తున్నాడు. ఇందులో భాగంగా జమిలి ఎన్నికలు అంటూ బాబు ప్రచారం చేయటం మొదలుపెట్టాడు.

cbn telugurajyam

 2022 లో దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరగబోతున్నాయి, అందుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి,  అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి, సరైన బుద్ది చెప్పాలని పార్టీ క్యాడర్ కి చెపుతున్నాడు బాబు. ఆయన మాటలు గమనిస్తే ఇక చేసేది ఏమి లేదు, జమిలి వస్తేనే మనం బయట పడగలమనే సత్యం గోచరిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జగన్ పరిపాలన ఫలాలు కిందిస్థాయి నేతల దగ్గర నుండి కుల,ప్రాంతీయ, పార్టీ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు అందుకుంటున్నారు. దీనితో వైసీపీ మీద అనుకున్న స్థాయిలో వ్యతిరేకత రావటం లేదు. బాబు అండ్ కో ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన కానీ, ఈ పదిహేను నెలల కాలంలో జగన్ సర్కార్ పై సామాన్య ప్రజల్లో వ్యతిరేకతను తీసుకోని రాలేకపోయింది. టీడీపీ శ్రేణుల్లో కూడా సీఎం జగన్ పరిపాలన బాగానే ఉందిగా అనే మాటలు వినవస్తున్నాయి. దీనితో ఏమి చేయాలో తెలియని చంద్రబాబు జమిలి ఎన్నికల మంత్రాన్ని చెపుతున్నాడు.

  ఒక పక్క బీజేపీ జమిలి ఎన్నికలపై పెద్దగా స్పందించకుండా ఉంటే, చంద్రబాబు ఆయన అనుకూల మీడియా మాత్రం జమిలి జమిలి అంటూ కలవరిస్తున్నాయి. కేవలం టీడీపీ శ్రేణుల్లో ఉత్సహం నింపటానికి బాబు ప్రస్తుతం చేస్తున్న జిమ్మిక్కు మాత్రమే ఈ జమిలి ఎన్నికలు అంటూ రాజకీయ విశ్లేషకులు తేల్చి చెపుతున్నారు. ఇకనైనా ఇలాంటి జిమ్మిక్కులను నమ్మకోకుండా పార్టీ ఎదుగుదల కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలని, లోకేష్ బాబును ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో రాజకీయాల్లోకి తీసుకోని రావాలని, కనీసం రాహుల్ గాంధీని చూసైనా లోకేష్ లో మార్పు రావాలని, ట్విటర్ లో పోస్ట్ లు వేస్తె ఓట్లు రావని, రోడ్డు మీద పోరాటాలు చేస్తేనే కనీసం పది ఓట్లు అయినా వస్తాయి కానీ , ఇలా జమిలి, జూమ్ అంటూ కూర్చుంటే లాభం లేదనే మాటలు వినవస్తున్నాయి