Babu Mohan: కోట గారి లాంటి మరణమే నాకు రావాలి.. కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్?

Babu Mohan: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కోటా శ్రీనివాసరావు ఒకరు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన విలన్ పాత్రలలో నటించడమే కాకుండా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇలా విలన్ గా , కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కోటా శ్రీనివాసరావు జూలై 13 వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఇక ఈయన మరణం తర్వాత ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కోటా శ్రీనివాసరావు గారితో వారికి ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తూ వచ్చారు.

ఇక కోట శ్రీనివాసరావుతో ఎంతో అనుబంధం కలిగినటువంటి వారిలో బాబు మోహన్ ఒకరు వీరిద్దరి మధ్య ఒరేయ్.. పోరా.. అనే చనువు ఉండేది అచ్చం అన్నదమ్ములు మాదిరిగానే వీరి బంధం ఉండేదని చెప్పాలి. అయితే కోట శ్రీనివాసరావు మరణించిన తర్వాత బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోట శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తను నాకు ఒక అన్నయ్య లాంటి వ్యక్తి అని తెలిపారు. ఏమి జరిగినా తనతో అన్ని విషయాలను పంచుకునే వాడిని. అయితే గత మూడు సంవత్సరాలుగా కోటా శ్రీనివాసరావు బాత్రూంలో జారిపడి కాలికి గాయమైందని అయితే ఆ గాయం మానకుండా ఉండటంతో ఎంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

అయితే ఒక విషయంలో మాత్రం కోట గారు చాలా అదృష్టవంతులు మంచాన పడి కుటుంబ సభ్యులతో సేవ చేయించుకుంటూ అసహ్యించుకోకుండా నిద్రలోనే మరణించారు. నాకు కూడా అలాంటి మరణమే కావాలని ఆ దేవుడిని అడుగు కోటన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చనిపోవడానికి ముందు రోజు సాయంత్రం నేను ఫోన్ చేశానని, ఆయన ఫోన్ చేసిన సమయంలో నిద్రపోతున్నారని చెప్పారు నిద్ర లేవగానే ఫోన్ చేయమని చెప్పాను అయితే మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కోట గారి నుంచి ఫోన్ రావడం ఆయన చనిపోయారని వార్త తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నానని ఈ సందర్భంగా బాబు మోహన్ ఎమోషనల్ అయ్యారు.