Babu Mohan: కొందరు తన జీవితంలో లేనివి కల్పించి ఏవేవో ప్రచారం చేశారని నటుడు బాబు మోహన్ అన్నారు. తాను కూడా చాలా విన్నానని, కానీ తెలిసినంత మాత్రానా అదే నిజం అయిపోదు కదా అని ఆయన చెప్పారు. ఎదుగుతున్న సమయంలోనే ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయని, ఉదాహరణకు కాయలున్న చెట్టుకే రాయి విసిరేస్తారు గానీ ఉత్త చెట్టుకు విసురుతారా అని ఆయన ప్రశ్నించారు.
ఇకపోతే తాము ఎదిగిన ఎదుగుడు సామాన్యమైన ఎదుగుడు కాదని, బాబు మోహన్ నటిస్తే 100రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయని, తాను ఏమైనా చిరంజీవినా అలా డ్యాన్సులు వేయడానికి, బాంచత్, ఆయన మగాడు అని బాబు మోహన్ పొగడ్తలతో ముంచెత్తారు. చిరంజీవి రబ్బరు తిరిగినట్టు ఎటు అంటే అటు తిరుగుతాడని, ఆయన డ్యాన్స్ చేస్తూ టీవీలో కనబడుతుంటే తాను కళ్లు ఆకాశమంత చేసి చూస్తానని బాబు మోహన్ అన్నారు. రాధ, భానుప్రియ, విజయశాంతి, రాధికలతో నువ్వా నేనా అంటూ వేసిన స్టెప్పులు అద్భుతం అని ఆయన చెప్పారు. ఆయన ఫిజిక్ కూడా మెయింటైన్ చేస్తారని, ఆయన వంగినట్టు హీరోయిన్లు కూడా వంగలేకపోయారని బాబు మోహన్ చెప్పారు. వాళ్లు నిలబడి చేస్తే, చిరంజీవి మాత్రం స్ర్పింగు తిరిగినట్టు తిరిగేవాడని ఆయన తెలిపారు.
మిగతావాళ్లు డ్యాన్స్ వేయరని కాదు, రాదని కాదు. అందరూ బాగా వేస్తారు. ఇప్పుడున్న హీరోల్లో కూడా చాలా మంది బాగా డ్యాన్స్ చేసే వాళ్లు ఉన్నారని బాబు మోహన్ అన్నారు. కానీ చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే మాత్రం ఒక మగాడు డ్యాన్స్ చేస్తున్నట్టే అనిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.