సుమ ఛానల్‌లో అవినాశ్ ఓవర్ యాక్షన్.. తలపట్టేసుకున్న సుమ!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. జబర్దస్త్ లో కమెడియన్ గా ఫేమస్ అయిన ముక్కు అవినాష్ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. బిగ్ బాస్ వల్ల అవినాష్ కి టీవీ షోస్ తో పాటు సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. మాటీవీలో ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్లో అవినాష్ తన భార్యతో కలిసి పాల్గొని సందడి చేశాడు. వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అవినాష్ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ వీడియోస్ ఇన్ స్టోరీస్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల మా టీవీలో ప్రసారం అయిన మా బోనాలు ఈవెంట్‌లో కూడా అవినాష్ దుమ్ములేపేశాడు. ప్రముఖ యాంకర్ సుమ కూడా ఈ షోలో సందడి చేసింది. అయితే సుమ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ వీడియోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయింది. తాజాగా సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మా బోనాలు ఈవెంట్ బిహెండ్ సీన్స్ అంటూ ఈ ఈవెంట్ బ్యాక్‌లో జరిగిన సంఘటనలను గురించి, తన మేకప్ గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సెట్ లో ఉన్న అందరిని చూపిస్తూ మా యూట్యూబ్ ఛానల్ అంటూ చెప్పటంతో అందరూ హాయ్ చెప్పారు. కానీ అవినాష్ మాత్రం కొంచం ఓవర్ చేస్తూ ముక్కు అవినాష్ యూట్యూబ్ చానెల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాడు.

అవినాష్ ఇలా ఒకసారి కాదు కెమెరా దగ్గరికి వచ్చి మూడుసార్లు ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాడు. దీంతో సుమ అవినాష్ చేసిన పనికి తలపట్టుకుని దగ్గరికి వెళ్లకు వాళ్ళు భయపడతారు అని అంటుంది. ఇక్కడున్న వాళ్లందరికీ ఒక్కో యూట్యూబ్ చానెల్ ఉంది. అందరివీ సబ్ స్క్రైబ్ చేయండి. నేను వాళ్ళు మీరు అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని సుమ చెప్పుకొచ్చింది. ఆన్ స్క్రీన్ మీద కాకుండా బ్యాక్ స్టేజ్ లో అవినాష్ అల్లరికి సుమకు పిచ్చెక్కి పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.