Avinash: తగ్గేదే లే అంటున్న అవినాష్ భార్య.. అవినాష్ ను మించి పర్ఫామెన్స్!

Avinash: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ జబర్దస్త్ షోలో తన స్కిట్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. ఇక తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ కాస్త అతినాష్ అయ్యాడు. బిగ్ బాస్ లో కూడా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి తోపాటు, హౌస్ మేట్స్ కు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చాడు.

ఇక జబర్దస్త్ షో తో పాటుగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో కూడా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చిన్న చిన్నగా తన ఫ్యామిలీని కూడా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేశాడు అవినాష్. మొదట తన తమ్ముడు అజయ్ తీసుకువచ్చాడు. వారిద్దరూ కలసి పలు స్కిట్ లు కూడా చేశారు. ఇదిలా ఉంటే అవినాష్ ఇటీవలే ఒక ఇంటివాడు అయిన విషయం తెలిసిందే. తనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక తన భార్యను కూడా ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. తన భార్యతో కలిసి స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడి సీజన్ 3లో జంటగా పాల్గొంటున్నారు.

మొత్తానికి తనతో పాటు తన భార్యను కూడా బాగా పాపులర్ చేయాలని అవినాష్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన భార్యతో కలిసి ఇటీవలే ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేశాడు ఇప్పటికే యూట్యూబ్ లో తన భార్యతో కలిసి పలు వీడియోని చేశాడు. తన భార్య అనూజ ని బాగానే ప్రోత్సహిస్తున్నాడు. యూట్యూబ్ లో వీడియోలు,ఇంస్టా రీల్ వీడియోలతో అవినాష్ దుమ్ము లేపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన భార్యతో కలిసి ఒక వీడియోని చేశాడు. ఇక అందులో తన భార్య పర్ఫామెన్స్ చూసి అవినాష్ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఆ వీడియోని చూసి సిరి తెగ నవ్వేసుకొని ఎంత క్యూట్ గా ఉందో అంటూ కామెంట్ పెట్టేసింది.