టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేరు మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తనపై వచ్చిన ఫేక్ ట్వీట్లకు కొద్ది సేపటి క్రితమే లొకేష్ బధులిచ్చారు. ఇంతలో వైకాపా మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇంతకీ మంత్రిగారు ఏమన్నారంటే? సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమికి లోకేష్ కారణం కాదా? పార్టీని భ్రష్టు పట్టించింది లోకష్ కాదా? లోకేష్ టీడీపీలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిందో ఆ పార్టీ నాయకులకు తెలియదా? అంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయారని కళావెంకటరావుని టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని చూస్తున్న దానిలో నిజం ఎంతో తెలియదా? అని ప్రశ్నించారు.
లోకేష్ కూడా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోకుండా ఎలా కొనసాగుతారు? అని మండిపడ్డారు. చంద్రబాబు- లోకేష్ మాటలు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. లోకేష్ నాయకత్వంలో నడవడానికి టీడీపీలో ఏ నాయకుడు సిద్దంగా లేరన్నారు. లోకేష్ కి బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారేమో! ఓ సారి అడిగి చూడండి? ఈ మాట గంటా శ్రీనివాసరావుతో చెప్పించండి ఆయన ఎలా స్పందిస్తారో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అవంతి వ్యాఖ్యలు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా గంటా పేరు అవంతి నోట రావడం ఆసక్తికరంగా మారింది.
టీడీపీ ఓటమిపాలైన దగ్గర నుంచి గంటా పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే . ఆ మధ్య వైకాపాలోకి జంప్ అయ్యే ప్రయత్నాలు చేసినట్లు వినిపించింది. కానీ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటీవలే మళ్లీ పలువురు టీడీపీ ఎమ్మెల్యే లు ప్యాన్ కిందకు రావడానికి సిద్దమవుతున్నట్లు కథనాలు వేడెక్కించాయి . ఆ సమయంలో గంటా పేరు కూడా వినిపించింది. అలాగే గంటా బీజేపీలో చేరుతున్నట్లు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. కానీ ఆయన ఇప్పటివరకూ ఎలాంటి జంపింగ్ తీసుకోలేదు. అయితే అవంతి మాటలను బట్టి గంటా కూడా లోకేష్ సారథ్యంలో నడవడానికి ఇష్టపడలేదని ఓ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే గంటా-అవంతి క్లోజ్ ప్రెండ్స్. పార్టీలు వేరైనా…స్నేహితులుగా కలిసి ఉన్నారు. అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది గంటానే. అలాగే అవంతి ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైకాపాలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే.