కేఎల్ రాహుల్ కి నిరాశే ..తోలి టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ లో తొలి టెస్టు ఆడనున్న ప్లేయింగ్ ఎలెవన్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఆడిలైడ్ ‌లో గురువారం తొలి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఆడనుండగా, ముగ్గురు పేసర్లతో భారతజట్టు బరిలోకి దిగనుంది. స్పినర్‌గా సీనియర్ బౌలర్ అశ్విన్‌కు అవకాశం దక్కింది.

సూపర్ ఫాంలో ఉన్నప్పటకీ కేఎల్ రాహుల్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వికెట్ కీపర్‌గా పంత్‌ను కాదని.‌. సీనియర్ సాహాకే అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్‌కు వైస్ కెప్టెన్‌ గా రహానే వ్యవహరించనున్నాడు. పేస్ బౌలింగ్ లో బుమ్రా, షమీలతో సీనియర్ పేసర్ ఉమేష్ వైపే మొగ్గు చూపాడు విరాట్ కోహ్లీ. స్పినర్‌గా సీనియర్ బౌలర్ అశ్విన్‌కు అవకాశం దక్కింది. గాయంతో ఇబ్బంది పడుతున్న రవీంద్ర జడేజాకు చోటు కల్పించలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో రాణించిన శుభ్ మన్ గిల్ కు చోటు దక్కకపోవడంతో కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. ఫామ్ లో లేని పృథ్వీ షా కు టీమ్ మేనేజ్ మెంట్ ఓటు వేసింది.

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ : విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా, రవిచంద్ర అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా