Pawan Kalyan: దిల్ రాజు భాస్కర్ రేంజ్ లో నటించాడు.. కావాలనే ఇదంతా చేసాడు..సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన సత్యనారాయణ!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల బంద్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్ల బంద్ పై సంచలన వాఖ్యలు చేశారు. దీని వెనక జనసేన ప్రముఖ నేత, రాజమండ్రి నగర ఇంఛార్జి, అనుశ్రీ ఫిల్మ్స్ అధినేత అత్తి సత్యనారాయణ ఉన్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సత్యనారాయణ‌ను పార్టీ నుంచి డిస్మిస్ చేయడంతో పాటు సత్య నారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు.

అయితే తాజాగా దీనిపై స్పందించారు అత్తి సత్యనారాయణ. ఈ సందర్బంగా సత్య నారాయణ స్పందిస్తూ.. థియేటర్ల బంద్ విషయంలో దురుద్దేశం తోనే దిల్ రాజు నా పేరు చెప్పారు. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారు. ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడు కోవడం కోసం దిల్ రాజు నా పేరు చెప్పారు. నేను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు. ఒక జర్నలిస్టు అడిగిన దానికి సినిమాలు లేక థియేటర్లు మూసి వేయాల్సి వస్తుందనీ అన్నాను అంతే. జూన్ 1న థియేటర్ల బంద్ చేయిస్తామని దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తొడగొట్టి మరి చెప్పారు.

ఇప్పుడు ఆయన తమ్ముడుని కాపాడుకోవడానికి దిల్ రాజు నాపై అభాండం వేశారు. దిల్ రాజు ఆస్కార్ నటుడి రేంజ్ లో నటించారు. కమల్ హాసన్ ను మించి యాక్ట్ చేస్తున్నారు. నా దేవుడు పవన్ కళ్యాణ్ సినిమాను నేను ఎందుకు అడ్డుకుంటాను. దిల్ రాజు నైజాం నవాబులా ఏలుదాము అని అనుకుంటున్నాడు. త్వరలోనే నిజ నిజాలు తెలుస్తాయి అని అన్నారు సత్య నారాయణ. అయితే ఈ సందర్భంగా సత్యనారాయణ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.