ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయ్యింది. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ప్రతిపక్షలు కూడా ఊహించలేదు. అదే సమయంలో తన చిత్తశుద్ధిని శంకించే వాళ్లకు గట్టి సమాధానం ఇస్తూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటంలో తనకు సాటిలేదని మరోసారి నిరూపించాడు సీఎం జగన్
దేశ వ్యాప్తంగా కేంద్రం తెచ్చిన మూడు కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ స్థాయిలో గత రెండు వారాల నుండి రైతులు ధర్నాలు చేస్తున్నారు, దానికి మద్దతు గా నేడు దేశం మొత్తం బంద్ కు పిలుపునిచ్చారు. దీనితో అనేక రాజకీయ పార్టీలు, దేశంలోని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు స్వచ్చందంగా బంద్ కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయటానికి పుంజుకున్నాయి.
ప్రధాని మోడీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఇందుకు మద్దతు ఇచ్చాయి. మోడీ అనుకూల పార్టీలు ఎలాగూ బంద్ కు దూరంగా ఉంటాయి, ఇక తటస్థ వాద పార్టీగా ఉన్న వైసీపీ బంద్ కు మద్దతు ఇస్తుందా లేదా అనే దానిపై అందరు దృష్టి పెట్టారు. ఆంధ్రాలో మాత్రం బంద్ కు సీఎం జగన్ మద్దతు ఇస్తాడా లేదా అనే దానిపై సరైన క్లారిటీ లేదు. మోడీకి భయపడి జగన్ బంద్ కు మద్దతు ఇచ్చే ఆవకాశం లేదని, దీనితో ఆ పాయింట్ ను హైలైట్ చేస్తూ, జగన్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని బురద చల్లటానికి ప్రతిపక్షలు సిద్దమైన తరుణంలో వాళ్లకు షాక్ ఇస్తూ రైతు బంద్ కు సీఎం జగన్ అధికారికంగా మద్దతు ప్రకటించాడు.
వైసీపీ ప్రభుత్వం రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చి బంద్ కి తానే స్వయంగా సహకరించడంతో ఏపీలో రైతన్న బంద్ నూటికి నూరు శాతం విజయవంతం అయింది ఏపీలో అన్ని కార్యకలాపాలు, ప్రభుత్వ సేవలు, ఆఫీసులు అన్నీ బంద్ వేళ మూత పడేలా ప్రభుత్వమే కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రతిపక్షల నోరెత్తే అవకాశం లేకుండా చేయటమే కాకుండా రైతుల విషయంలో తన స్టాండ్ ఏమిటో, తాను ఎవరి పక్షాన నిలబడుతాడో మరోసారి నిరూపించాడు సీఎం జగన్.