అధినేతతో గోరంట్లకు గ్యాప్ తగ్గిందా

ఏపీ రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరీది అరుదైన ప్రస్తానం. ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు టీడీపీలో చేరారు. 38 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెల్చినా మంత్రిపదవి చేపట్టింది మాత్రం కేవలం ఒకే ఒక్కసారి. అదేంటో ఎప్పుడు మంత్రిమండలి విస్తరణ జరిగిన ఫస్ట్ వినిపించేది ఈయన పేరే తీరా చూస్తే మిగతా అందరికి అవకాశాలు వస్తాయి కాని ఈయనన్ని మాత్రం మంత్రి పదవి వరించదు.

పార్టీ అధిష్టానం ముందు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిస్థితి మారదు. పోనీ అలా అని యాక్టివ్ గా లేడా అంటే ఫుల్ యాక్టివ్ కాని అదృష్టం మాత్రం అంతంతే. దీంతో అలకబూని కొంత కాలం సైలెంట్ గా ఉండడంతో మళ్లీ విధిలేక రాజకీయాల్లో యాక్టివ్ కావడం ఈయనకు పరిపాటి అయిపోయింది. పార్టీ అధినేత చంద్రబాబుకు ఈయనకు మధ్య గ్యాప్ ఏర్పడిందని కారణాలు ఏమైనా ఆ మనస్పర్థలు ఇంకా కొనసాగడం వల్లే టీడీపీకి వీర విధేయుడిగా ఉన్నా గోరంట్లకు అవకాశాలు రావడం లేదని సమాచారం. 


1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టీనప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ విధివిధానాల రూపకల్పన నుంచి భాగస్వామ్యం ఉంది. పార్టీ ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్లను అధిగమించడంలో తన వంతు సహాయసహకారాలు అందించారు. అయితే చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు వచ్చినప్పటి నుంచి ఈయనకు ప్రయారిటీ తగ్గిపోయింది. అయితే ఇటీవలే ఈయన్ని మళ్లీ పార్టీ పొలిట్ బ్యూరో లోకి తీసుకోవడంతో వీరిద్ధరి మధ్య నెలకొన్న గ్యాప్ తగ్గిందన్న టాక్ నడుస్తోంది.
అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వాళ్లను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి వారిని బాగా ఎంకరేజ్ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.