యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఎన్నో నవలలు రచించారు. ఆ నవలలు కూడా మంచి ఆదరణ పొందాయి. యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా మాత్రమే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా మంచి గుర్తింపు పొందారు. మోటివేషనల్ స్పీకర్ గా ఆయన యువతకి మంచి మంచి సలహాలు ఇస్తూ వారి భవిషత్తు ప్రణలికల కోసం సూచనలు చేసేవారు.
యండమూరి వీరేంద్రనాథ్ , మెగాస్టార్ చిరంజీవి గారికి మధ్య మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ నటించిన ఎన్నో సినిమాలకు ఎండమూరి పనిచేశాడు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మృగరాజు సినిమాకి సంబంధించిన కొన్ని సీన్లు ఎలా పెట్టాలో చెప్పినట్టు ఒక ఇంటర్వ్యూ లో యండమూరి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మృగరాజు సినిమాలో అడవిలో ఉండే చిరంజీవిని ఒక ఐఏఎస్ చదువుతున్న అమ్మాయి ప్రేమించటానికి ఎలాంటి సన్నివేశాలు పెట్టాలి అన్న విషయం తో పాటు మరొక 2,3 సీన్లు కూడా కూడా చెప్పానని ఆయన వెల్లడించారు.
మృగరాజు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ కుమారుడు పెళ్లి జరిగింది. అయితే చిరంజీవిగారితో యండమూరికి ఉన్న మంచి అనుబంధం కారణంగా తన కుమారుడి పెళ్లికి రెండు, మూడు లక్షల డబ్బులు అవసరం అవుతాయని చిరంజీవి గారికి చెప్పారు. దీంతో చిరంజీవిగారు దేవి ప్రసాద్ తో మాట్లాడి సినిమా కోసం తాను చెప్పిన 2,3 సీన్లకు 4 లక్షల రూపాయలు డబ్బు ఇప్పించినట్టు ఈ ఇంటర్వ్యూ లో యండమూరి చెప్పుకొచ్చారు.