మరోసారి కాళ్ళు పట్టుకొనే రోజు రాకూడదు.. ఎమోషనల్ అయిన ఆసియా?

పటాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆసియా నూకరాజు ఒకరు. ప్రస్తుతం వీరందరూ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నూకరాజు ఆసియా తాజాగా ప్రసారమైన శ్రీదేవి కంపెనీ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరువు హత్యల గురించి స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో భాగంగా వీరు నటించడం కాకుండా జీవించారని చెప్పాలి. ఇక వీరి స్కిట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఇకపోతే వీరి పర్ఫార్మెన్స్ చూసిన ఆటో రాంప్రసాద్ ఇంత అద్భుతంగా చేశారు మీరు నిజమైన ప్రేమికులా అని ప్రశ్నించారు. ఇలా రాంప్రసాద్ అడగగానే హైపర్ ఆది వీరిద్దరూ నిజమైన ప్రేమికులు ఏం చెప్పలేదా అని నూకరాజును ప్రశ్నిస్తాడు.ఇకపోతే నూకరాజు తన లవ్ స్టోరీ చెబితే నవ్వుతారేమో అని ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు అని చెప్పగా మరేం పర్లేదు చెప్పు అని అనడంతో తన చేతిలో ఉన్న మైక్ ఆసియా చేతికి ఇచ్చి వెంటనే తన కాళ్లు పట్టుకుని మనం విడిపోయే రోజు రాకూడదు అని కోరుకుంటున్నా అంటూ తనలో ఉన్న ప్రేమను బయట పెట్టారు.

ఈ విధంగా నూకరాజు తన ప్రేమను బయటపెట్టడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఎంతో షాక్ అవ్వడమే కాకుండా ఎమోషనల్ అయ్యారు.ఇక నూకరాజు తన కాళ్ళు పట్టుకోవడంతో ఆసియా స్పందిస్తూ మన జీవితంలో ఎప్పుడు కూడా మన ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఇలా నువ్వు కాళ్లు పట్టుకుని రోజు రాకూడదని ఆసియా చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక తనంటే నాకెంతో ఇష్టం అని ఇప్పుడే ఇక్కడే తన మెడలో తాళి కట్టేయమన్నా కట్టేస్తాను అంటూ నూకరాజు తన ప్రేమని బయటపెట్టారు.