ఆ వీడియో చూసి వేదికపై నాగార్జునకి ముద్దు పెట్టిన ఆశు రెడ్డి!

తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్బాస్ ప్రస్తుతం ఆరవ సీజన్ ఓటిటి లో నాన్ స్టాప్ గా ప్రసారమవుతోంది. ఈ నాన్ స్టాప్ సీజన్ ఇప్పటికీ 10 వారాలు పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలే కి చేరువలో వుంది. గడిచిన వారం వీకెండ్ లో ఆశు రెడ్డి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మునుపటి సీజన్ తో పోల్చితే ఆశు ఈ సీజన్ లో ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంది. దాదాపు టాప్ 5 కి చేరువలోకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యింది.

టాప్ 5 కంటెస్టెంట్ లలో ఒకరిగా ఉంటానని అనుకున్న ఆశు 8 వ వారం లో బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రావడంతో అందరి అంచనాలు తారుమారు అయ్యి ఆశు ఎలిమినేట్ అయింది. గడిచిన వారంలో ఆశు రెడ్డి, అరియానా ఇద్దరు డేంజర్ జోన్ లో ఉండటంతో నాగార్జున ఇద్దరినీ నిలబెట్టి ఆశు ని ఎలిమినేట్ చేసాడు. టాప్ 5 లో ఉండటం మా అమ్మా కల అని చెప్పిన ఆశు చివరికి హౌజ్ లో లేకుండా ఎలిమినేట్ అయింది. హౌజ్ లో ఉండి పెద్దగా గేమ్ కూడ ఆడలేదు. అంతే కాకుండా సంచాలక్ గా కూడ ఆశు విఫలం అయింది. దీంతో ఆశు రెడ్డి హౌస్ మేట్స్ నుండి నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అంతేకాకుండా నామినేషన్స్ లో అరియానా ని నామినేట్ చేసి అర్థంలేని రీసన్స్ చెప్పింది. ఈ క్రమంలో పీచ్ రూమ్ లో అఖిల్ కి దూరంగా ఉంటున్నావని ఎందుకు అన్నావ్ ? మా అమ్మ వచ్చినప్పటి నుంచీ అలా ఉన్నానని నువ్వు ఎందుకు అన్నావ్ అంటూ అరియానా ని ఆశు నిలదీసి నామినేట్ చేసింది. ఈ సందర్భంగా అరియానా క్లారిటీ ఇచ్చినా కూడా చాల రోజుల వరకు ఇద్దరి మద్య మాటలు లేవు. అంతటితో ఆగకుండా ఇద్దరు ఒకరిపై ఒకరు సెటైర్లు కూడా వేసుకున్నారు. దీంతో అరియానా ఫ్యాన్స్ హర్ట్ అవ్వటంతో ఆశు ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆశు బయటికి వచ్చిన తరువాత నాగార్జున కి ముద్దు పెట్టే సీన్ రావటంతో వెళ్ళిపోయే ముందు కూడా స్టేజి మీద నాగార్జునకి మళ్లీ ముద్దు పెట్టింది.