Ashu Reddy: రోడ్లను క్లీన్ చేస్తున్న అషురెడ్డి… ఏంటి ఆ పోజులంటూ.. ట్రోల్స్!

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకుని అనంతరం అదే పాపులారిటీ తో బిగ్ బాస్ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ముద్దుగుమ్మ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మొన్నటికి మొన్న అరియాన నడుముకి ముద్దు పెట్టిసంచలనంగా మారిన ఈమె నిన్న రవి బండిపై వెళ్తూ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ చీపురు చేతబట్టి రోడ్లను శుభ్రం చేస్తూ సందడి చేసింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా అషురెడ్డి మరొక మహిళతో కలిసి రోడ్లను శుభ్రం చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ రెండు ఫోటోలు గురించి నన్ను ఏమీ అడగవద్దు అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ ఫోటోలలో ఈమె ఎంతో అలసిపోయి కూర్చున్నట్టు ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోల గురించి నెటిజన్లు ముందుగానే తనని ప్రశ్నిస్తారని భావించిన అషురెడ్డి ఆ ఫోటోల గురించి అడగవద్దూ అంటూ పోస్ట్ చేశారు.

ఈమె ఊహించిన విధంగానే నెటిజన్లు సైతం ఆ ఫోటోలో పై స్పందిస్తూ విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు. ఏదో పెద్ద పని చేసి అలసిపోయినట్లు ఆ పోజులు ఏంటి అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు మాత్రం అషురెడ్డి క్లీన్ నెస్ గురించి చెబుతున్నారా… అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ మాత్రం ప్రతి రోజు ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తూ పెద్దగా అభిమానులను ఆకట్టుకుంటున్నారు అని చెప్పవచ్చు.