Ashu Reddy: యాంకర్ శివను చెప్పుతో కొట్టిన అషు రెడ్డి.. కారణం అదేనా?

Ashu Reddy: బిగ్ బాస్ నాన్స్టాప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు కంటెస్టెంట్ ల మధ్య ఎన్నో టాస్క్ లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్ ల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మరికొందరు సరదా గొడవ పడుతూ ఉంటారు. ఇలా సరదాగా గొడవ పడుతూ ఆ విషయం సీరియస్ గా మారి ఎన్నో వివాదాలకు దారి తీస్తుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న అషు రెడ్డి యాంకర్ శివ పై ఏకంగా చెప్పుతో దాడి చేసింది.

అయితే ఆశు రెడ్డి శివ పై చెప్పు ఎత్తడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… యాంకర్ శివ అరీయానా ఏవీక్షన్ ఫ్రీ పాస్ గురించి మాట్లాడుతూ కూర్చున్నారు. అయితే అప్పటికే హౌస్మేట్స్ అందరూ కూడా నిద్ర పోయారు. ఇలా అందరూ నిద్రపోతున్న సమయంలో వీరిద్దరూ ఫన్ క్రియేట్ చేశారు.ఇలా అందరు నిద్ర పోతూ ఉండగా శివ అందరి దగ్గరికి వెళ్లి గజ్జల సౌండ్ చేస్తూ అందరినీ భయపెట్టారు. మొదట బాబా భాస్కర్ మాస్టర్ నిద్ర డిస్టర్బ్ చేశారు.అనంతరం ఆశు రెడ్డి దగ్గరకు వెళ్లి తన నిద్ర డిస్టర్బ్ చేయడంతో ఆమె నిద్ర లేచి ఏకంగా చెప్పు తీసుకొని శివ పై దాడి చేసింది.

ఇలా ఆశు రెడ్డి చొప్పు తీసుకోవడంతో అక్కడి నుంచి పరుగు తీసిన శివ వెళ్లి బెడ్ పై దుప్పటి కప్పుకొని కూర్చున్నారు. ఇక అక్కడికి వెళ్ళిన అషు రెడ్డి తనపై చెప్పుతో దాడి చేసింది. అక్కడికి అరియన వద్దని చెబుతున్నా వినకుండా అషు రెడ్డి తనని కొట్టింది.ఈ క్రమంలోనే ఈ వీడియో ఎంతో ఫన్నీగా చేసిన చాలా మంది నెటిజన్లు ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరదా అంటే మాటలు వరకు ఉండాలి కానీ ఇలా చెప్పులతో దాడి చేసుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.