పిచ్చి గంతులువేస్తూ పరువు పోగొట్టుకున్న అషు రెడ్డి.. ప్రాక్టీస్ అంటూ బలే కవర్ చేసింది?

అషు రెడ్డి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె సమంత పోలికలతో ఉండటంతో చాలామంది ఈమెను జూనియర్ సమంత అని భావించారు. ఈ క్రమంలోనే సమంత పోలికలు ఉండడంతో ఆశు రెడ్డికి రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఇకపోతే ఈమెకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా అశు చేసిన హంగామా మనకు తెలిసిందే.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన ఈమె సోషల్ మీడియాలో యధావిధిగా తన రచ్చ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా, డబ్ స్మాష్ వీడియోల ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె డాన్స్ చేస్తూ దారుణంగా తన పరువు మొత్తం పోగొట్టుకున్నారు. ఆశు రెడ్డికి పెద్దగా డాన్స్ రాదు అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా డాన్స్ చేస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ఈ క్రమంలో ఈ వీడియో వైరల్ కావడంతో స్వయంగా తన స్నేహితురాలు ఈ వీడియో పై స్పందిస్తూ..పిచ్చి అంటారు సర్ అని అషూ రెడ్డి వేస్తోన్న డ్యాన్స్‌ మీద సెటైర్ వేస్తూ తన పరువు మొత్తం తీసింది. అయితే తన ఫ్రెండు ఇలా కామెంట్ చేయడంతో స్పందించిన ఆశూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటూ కవర్ చేసింది. మొత్తానికి ఈ డాన్స్ వీడియో ద్వారా అషు రెడ్డి తన ఫ్రెండ్ చేతిలో దారుణంగా పరువు పోగొట్టుకొంది.