Focus Movie: విజయ్ శంకర్,అషు రెడ్డి భానుచందర్ సుహాసిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఫోకస్. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూర్య తేజ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. స్కైరా క్రియేషన్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు.మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
నేడు వాలెంటెన్స్ డే కావడంతో ప్రత్యేకంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో విజయ్ శంకర్,అషు రెడ్డి ఒకరినొకరు హత్తుకొని నవ్వుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో హీరో విజయ్ శంకర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా సీనియర్ నటి సుహాసిని మణిరత్నం జడ్జి పాత్రలో కనిపించనున్నారు.
భానుచందర్, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలలో కనిపించారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం వెల్లడించారు. సూర్య తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందించగా.. సత్య. జీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక నేడు వాలెంటెన్స్ డే కావడంతో వాలెంటెన్స్ డేకి ఫర్ ఫెక్టు పోస్టర్ గా ఉందని చెప్పవచ్చు.