Ashu Reddy: రవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన అషు…నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియో!

Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. కేవలం సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీగా మారిన ఈ ముద్దు గుమ్మ వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో ఓ సైడ్ ఆర్టిస్ట్‌గా అవకాశం అందుకుంది. అంతే కాకుండా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 3 అవకాశం సంపాదించుకున్న ఈమె సెలబ్రిటీ హోదాను కూడా సొంతం చేసుకుంది. దీంతో పాటు బుల్లితెరపై యాంకర్‌గా మరియు ప్రముఖ ఛానెల్‌లలో ప్రసారమవుతున్న వివిధ కామెడీ షోలలో పాల్గొంటూ టీవీ ప్రేక్షకులకు కూడా చేరువైంది అషు.

సామాజిక మాధ్యమాల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డికి.. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక తన ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే నెట్టింట్లో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోస్, ఫొటోస్ పోస్ట్ చేస్తూ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిపై ఎన్ని ట్రోల్స్, కామెంట్స్ వచ్చినా పట్టించుకోకుండా తనదైన స్టైల్లో దూసుకుపోతోంది అషురెడ్డి.

అయితే ఈ మధ్య ఆమె, యాంకర్‌ రవితో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే వారిద్దరూ కలిసి బైక్ రైడింగ్ చేస్తూ దిగిన ఫొటోస్‌ను షేర్ చేసింది అషు రెడ్డి. తాజాగా రవితో కలిసి చేసిన మరో వీడియో ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్ప చిత్రంలోని డైలాగ్‌తో చేసిన ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల‌్‌గా మారింది. ‘ఎన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు.. రేయ్ ఎవుర్తి రా అది.. అన్నో అంటుంది.. మళ్ళీ ముద్దెడతానంటుంది.. తు.. రేయ్ యాడదొరికిన సంతరా ఇది’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఓ సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.