New year celebrations: న్యూ ఇయర్ వేడుకల్లో అష్టా చమ్మా కేక్.. ఫోటోలు వైరల్!

New year celebrations: కొత్త సంవత్సరం వచ్చేసింది.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి చాలామంది ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవటాని చాలా రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ , వేరే ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంటారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరగడం వల్ల మొబైల్ ఫోన్లలో అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ 2022 కొత్త సంవత్సరం వేడుకలను కొద్దిమంది చాలా భిన్నంగా ప్లాన్ చేసుకున్నారు. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

సాధారణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.. కానీ ఇక్కడ అందరికీ భిన్నంగా కొత్త తరహాలో 2022 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి అష్టా చమ్మా కేక్ కట్ చేశారు. ఇప్పుడు ఈ అష్టాచెమ్మా కేక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

ఆంధ్ర ప్రదేశ్.. అనంతపురం జిల్లా.. బుక్కరాయసముద్రం మండలం.. రెడ్డిపల్లి గ్రామంలో ఈ కొత్త తరహా సెలబ్రేషన్స్ చోటుచేసుకున్నాయి. సాధారణంగా ప్రస్తుత కాలంలో అందరూ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ రెడ్డి పల్లి గ్రామం.. పెద్దమ్మ తల్లి వీధిలో అష్టా చమ్మా ఆటకు చాలా క్రేజ్ ఉంది. ఈ ఆధునిక కాలంలో కూడా ఈ వీధిలోని వారు తరచూ అష్టా చమ్మ ఆటని ఆడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.

పెద్దమ్మ తల్లి వీధిలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతిరోజు అష్టా చమ్మ ఆటను ఆడుతారు.. అందువల్ల ఈ వీధిని అందరూ అష్టా చమ్మ ఆటకి అడ్డా అని అంటుంటారు. 2022 కొత్త సంవత్సరానికి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలని అక్కడి స్థానికులు భావించారు. అయితే ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా తమకు పేరు తెచ్చిపెట్టిన అష్టా చమ్మా ఆటకి గుర్తుగా కేక్ ఆర్డర్ ఇచ్చి కేక్ మధ్యలో అష్టా చమ్మాను సెట్ చేయించారు.
అష్టా చమ్మ ఆటలో ఎంతో ప్రావీణ్యం ఉన్న కొండారెడ్డి, శ్యామల , ప్రవీణ్ , శైలజ , ముత్యాలు , ప్రేమ ఈ అష్టాచమ్మా కేక్ కట్ చేసి 2022 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు.