Asha Shaini : ‘లక్సు పాపా.. లక్సు పాపా..’ అంటూ నందమూరి బాలకృష్ణ ఆడిపాడిన ఆ బొద్దుగుమ్మ గుర్తుందా.? అదేనండీ ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా శైనీ. ఇప్పడీ బ్యూటీ ఏం చేస్తోందా తెలుసా.? హిందీలో తెరకెక్కుతోన్న అనేక వెబ్ సిరీస్‌లలో దుమ్ము రేపేస్తోంది.
దాదాపు అన్నిట్లోనూ అమ్మడికి దక్కుతున్నది అందాల ఆరబోత పాత్రలే.
వెండితెరపై చేసిందే, వెబ్ సిరీస్‌ల కోసం కూడా చేస్తున్నానంటోంది ఆశా షైనీ అలియాస్ ప్లోరా శైనీ. అడపా దడపా బుల్లితెరపైనా, వెండితెరపైనా కనిపిస్తోన్న ఆశా షైనీ, తనలాంటి చాలామందికి ఓటీటీ బెస్ట్ ఆప్షన్ అయ్యిందంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన ‘143 ఐ లవ్ యూ’ సినిమాలో జర్నలిస్టు పాత్రలో ఆశా షైనీ నటించిన సంగతి గుర్తుండే వుంటుంది.
తెలుగు తెరపై మళ్లీ కనిపించాలనుకుంటున్నట్లు చెప్పిన ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌ల రాకతో వెండితెరపైనా మార్పులు వచ్చాయని అభిప్రాయపడింది.
అన్నీ ఒకే తరహా పాత్రలు, అందునా శృతిమించిన శృంగార సన్నివేశాలేనా.? అనడిగితే, సినిమాల్లోనూ నటీనటులు హద్దులు దాటేస్తున్న వైనాన్ని ప్రస్తావించింది.
‘నా వరకూ నేను సినిమాల్లో ఎలాగైతే ప్రొఫెషనల్ నటిగా వ్యవహరించానో, ఇప్పుడూ అంతే. నాకేమీ పెద్దగా తేడా అనిపించడంలేదు..’ అని బదులిచ్చింది ఓ ప్రశ్నకు ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా శైనీ.
త్వరలో ఓ వెబ్ సిరీస్‌కి నిర్మాత కాబోతోందట ఈ బొద్దుగుమ్మ.