ఉత్తమ్ కు హైకమాండ్ హెచ్చరిక ఇచ్చినట్లే..?

uttam kumar reddy telugu rajyam

  దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కు అగ్నిపరీక్ష అనే మాటలు వినవస్తున్నాయి. గతంలోనే పీసీసీ పదవి నుండి ఆయన్ని తప్పించాలని చుస్తే పార్టీ లో వ్యతిరేకత రావటంతో ఆగిపోయారు. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం తమకి మరో అవకాశం ఇవ్వాలని , దుబ్బాక ఉపఎన్నికలు,GHMC లు వరకు ఉత్తమ్ కుమార్ నే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని కోరటం జరిగింది. దీనితో అధిష్టానం కూడా దుబ్బాక ఫలితాలు వరకు వేచిచూడాలనే ధోరణిలో ఆగిపోయింది.

cheruku srinivas reddy telugu rajyam

 రాష్ట్రంలో తాజాగా జరిగిన పరిణామాలు గమనిస్తే ఉత్తమ్ విషయంలో కాంగ్రెస్ వైఖరి మారినట్లు తెలుస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్దపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని బరిలో దించాలని భావించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేవలం నర్సారెడ్డి పేరునే మాత్రమే పార్టీ హైకమాండ్ కి పంపించాడు. అయితే అనూహ్యంగా పార్టీలోకి వచ్చిన చెరకు శ్రీనివాస్ రెడ్డికి పార్టీ టిక్కెట్ కేటాహిస్తూ ఢిల్లీ నుండి సమాచారం వచ్చింది. దీనితో ఉత్తమ్ కుమార్ వర్గం ఏమి చేయలేక సైలెంట్ అయిపొయింది. ఉత్తమ్ అభీష్టం మేరకైతే నర్సారెడ్డి ని ఖరారు చేయాలి, కానీ శ్రీనివాస రెడ్డిని ఫైనల్ చేశారంటే కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి ఆలోచనతో ఉందొ ఇట్టే అర్ధం అవుతుంది.

 దుబ్బాక ఫలితం కంటే ముందుగానే ఉత్తమ్ సిపారస్సులను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవటం లేదనే మాటలు కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాంటి కామెంట్స్ చేయకుండా పార్టీ విజయం కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. ఈ పరిస్థితులో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినా దానివలన కలిగే లాభం ఏమిలేదని ఆయనకు తెలుసు. ఎలాగైనా సరే ఈ ఎన్నికలో విజయం సాధించి పీసీసీ పదవి పోకుండా కాపాడుకోవాలని చూస్తున్నాడు ఉత్తమ్, కానీ ప్రస్తుత పరిస్థితులో అంత ఈజీగా విజయం దక్కే అవకాశాలు కనిపించటం లేదు. సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకలో బలమైన రాజకీయనేత. పైగా చనిపోయిన సెంటిమెంట్ ఉంటుంది. వాటిని తట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం తలకు మించిన భారమనే చెప్పాలి..