Samantha: జీవితంలో అన్ని సెట్ అయినట్లే.. సమంత పోస్ట్ వైరల్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తెలుగింటి కోడలిగా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందింది.ఇలా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న సమంత వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకుల ఈ ప్రకటనతో విడిపోతున్నట్లు వెల్లడించారు.

ఈ విధంగా విడాకుల ప్రకటన తర్వాత సమంత ఎంతో కృంగిపోయింది. ఈ క్రమంలోనే ఆ బాధ నుంచి బయట పడటం కోసం ఈమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. తీర్థయాత్రలు వెళ్లడం, విదేశీ ప్రయాణాలు చేస్తూ ఇప్పుడిప్పుడే విడాకుల భాధ నుంచి బయటకు వస్తూ తన సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు. సమంత సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు చేస్తూ తన మనసులో భావాలను బయట పెట్టేది.ఈ సమయంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా సమంత మరొక పోస్టులను షేర్ చేస్తూ లైఫ్ లో అన్ని సెట్ అయ్యాయి… మధురమైన క్షణాలు అంటూ క్యాప్షన్ జోడించారు.

సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఫేస్ కూడా ఎంతో అందంగా కనిపించడంతో చాలామంది నిజంగానే సమంత జీవితంలో అన్ని సెట్ అయ్యాయి. విడాకుల తర్వాత ఎంతో కృంగిపోయిన సమంత ఇప్పుడిప్పుడే తన జీవితంలో సంతోషంగా కనపడుతూ కెరీయర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా… ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. మొత్తానికి సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.