అదొక మెంటల్ టార్చర్… అందుకే ఐ లవ్ యు చెప్పాను: ఆరియనా

ఆరియనా ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఇదే పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో సందడి చేసిన ఆరియనా టాప్ ఫోర్ కంటెంట్ గా బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ 4 ద్వారా సందడి చేసిన ఈమె సీజన్ 5 కార్యక్రమ బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు.

ఈ విధంగా వ్యాఖ్యాతగా అందరిని ఆకట్టుకున్న ఆరియనా తిరిగి నాన్ స్టాప్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఈమె పెద్దగా ఆసక్తి కనబరచనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ ఒకసారి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి మరోసారి ఆ కార్యక్రమానికి వెళ్లాలంటే చాలా మెంటల్ టార్చర్ ఉంటుంది.

అందుకే బిగ్ బాస్ స్టాప్ కార్యక్రమంలో నేను ట్రోఫీ కోసం పోటీ పడలేదని కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నానని తెలియజేశారు.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఈమె తరుచూ వెళ్లి బిగ్ బాస్ కెమెరాకు ఐ లవ్ యు చెప్పేది.అలా చెప్పడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా బిగ్ బాస్ తనని దత్తపుత్రిక అని చెప్పడంతో తాను తరచూ బిగ్ బాస్ పై తన ప్రేమను బయట పెడుతూ ఐ లవ్ యు చెప్పే దాన్ని అంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అరియాన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.