బిగ్ బాస్ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అరియానా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ సీజన్లో టాప్ 5 లో నిలిచి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ కి యాంకర్ గా వ్యవహించి యాంకర్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది . ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో కూడా పాల్గొని 25 లక్షల రూపాయల సొంతం చేసుకుంది. ఇలా బిగ్ బాస్ షో ద్వారా అరియానా బాగా పాపులర్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే అరియనా తన అందమైన ఫోటోలతో పాటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.ఇటీవల అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శివతో కలిసి చేసిన ఈ వీడియోలో అరియానా తనని పెళ్ళి చేసుకోమని శివ వెంట పడింది. అసలు విషయానికి వస్థే..ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మ్యారీ మీ అనే రీల్ శివతో కలిసి చేసింది. ఈ రీల్ లో అమ్మాయి అబ్బాయి తో ఉంగరం తొడిగించుకొని నన్ను పెళ్ళి చేసుకో అంటూ అబ్బాయి వెంట పడతారు.
అరియానా కూడా శివతో తన వేలికి ఉంగరం తోడిగించుకొని మ్యారీ మీ అంటూ శివ వెంట పడుతుంది. కానీ శివ మాత్రం అరియానాని అస్సలు పట్టించుకోడు. వీరిద్దరు కలిసి చేసిన ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అరియానా కెరీర్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ బజ్ కి యాంకర్ గా వ్యవహరించిన ఈమెకి ప్రస్తుతం పలు షో లకి యాంకర్ గా వ్యవహరించే ఛాన్స్ లు వస్తున్నా కూడ ఈ అమ్మడు తిరస్కరిస్తోందని సమాచారం. అయితే అరియానా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తొందర్లోనే ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటోంది.