Ariyana Glory: బోల్డ్ బ్యూటీ అరియనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదట్లో యూట్యూబ్ యాంకర్ గా ఈమె తన ప్రస్థానం మొదలుపెట్టి ప్రస్తుతం వెండితెరపై సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ పాపులారిటీ బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి టాప్ ఫైవ్ లో నిలిచింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు ఎంతో బిజీగా మారిపోయారు.
ఒకవైపు బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే
అరియనా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పుష్ప ఐటెం సాంగ్ కు ఎంతో అద్భుతంగా డాన్స్ చేసింది. తన మత్తు కళ్ళతో నడుము ఓంపులతో ఉ అంటావా మామ.. ఊఊ అంటావా అంటూ డాన్స్ ఇరగదీసింది.
ఈ విధంగా అరియనా ఈ విధంగా డాన్స్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా హాట్ గా ఉంది డాన్స్ పర్ఫార్మెన్స్ అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సమంత కన్నా అద్భుతంగా ఇరగదీసావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అరియనా సంబంధించిన ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.