Pregnancy Tips:ప్రస్తుత కాలంలో పురుషులతో పోటీగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అయితే కొందరు మహిళలు గర్భధారణ సమయంలో కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే గర్భధారణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనకు తెలిసిందే. అయితే ఆఫీసులో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు నిరంతరం కూర్చుని పని చేయడం వల్ల పూర్తిగా అలసి పోతారు.అయితే ఈ విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఉద్యోగాలు చేసే వారు తరచూ వారి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూ ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
ఆఫీసులలో ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా నీటిని తాగుతూ మధ్యమధ్యలో ఆపిల్ దానిమ్మ వంటి పండ్లను తీసుకోవాలి. ఇక ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసే మహిళలు ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో భాగంగా గ్రీన్ టీ తాగాలి. ఇలా గ్రీన్ టీ తాగడం వల్ల రోజంతా ఎంతో తాజాగా ఉంటారు. అలాగే అల్పాహారంలో రోటీలు, ఉడికించిన గుడ్లు కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
మధ్యాహ్న భోజనం: మధ్యాహ్న భోజనంలో భాగంగా గర్భిణీ స్త్రీలు వెజిటబుల్స్, రోటి, అన్నం,మజ్జిగ వంటి పదార్థాలను తీసుకోవాలి. అయితే వేటిని తీసుకున్న బాగా నమిలి తీసుకోవాలి అలాగే ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవాలి.
స్నాక్స్: ఆఫీస్ లో ఉద్యోగాలు చేసే మహిళలు స్నాక్స్ అంటే ఎక్కువగా సమోసాలు, పకోడీ, బజ్జి వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. అయితే గర్భిణీ స్త్రీలు వీటికి దూరంగా ఉండి ఏదైనా ఫ్రూట్ సలాడ్ లేదా సిట్రస్ జాతి పండ్ల జ్యూస్ తాగాలి.
రాత్రి భోజనం: గర్భిణీ స్త్రీలు రాత్రి భోజనంలో భాగంగా
మీరు రోటీ, సలాడ్, కూరగాయలలో బ్రోకలీ, పనీర్ , బేబీ కార్న్ తినవచ్చు. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి, కానీ కొద్దిసేపు వాకింగ్ చేసిన అనంతరం పడుకునే ముందు పాలు తాగి పడుకోవాలి.