ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండుమసుల వారి వరకు వారి చేతుల్లో మనకు స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి.సరైన సమయానికి ఆహారం తినకుండా అయినా ఉంటాము కానీ స్మార్ట్ ఫోన్లు కాలక్షేపం చేయడం మాత్రం ఆపడం లేదు ఇలా చాలామంది సెల్ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. ఈ విధంగా నిత్యం మొబైల్ ఫోన్ కి అంకితం అవుతూ సోషల్ మీడియాలోనే కాలం గడిపేస్తుంటారు.ఇలా సోషల్ మీడియాలో తరచూ కాలక్షేపం చేసేవారు కొన్ని నియమాలను నిబంధనలను తెలుసుకొని ఉండాలి పొరపాటున నిబంధనలను ఉల్లంఘిస్తే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి.
ఇలా సోషల్ మీడియాలో కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేస్తే పొరపాట్లు మనల్ని చిక్కుల్లో పడేస్తుంటాయి. మరి సోషల్ మీడియాలో నిత్యం కాలం గడిపేవారు ఎలాంటి తప్పులను చేయకూడదు ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలి అనే విషయానికి వస్తే…సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన చట్టం చాలా కఠినంగా ఉంటుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు వస్తే వాటి గురించి సెర్చ్ చేయడం కానీ లేదా వాటిని చూడటం కానీ పెద్ద నేరంగా పరిగణిస్తారు.
సోషల్ మీడియా వేదికగా అసత్యపు వార్తలను ప్రచారం చేయడం చాలా పెద్ద తప్పు ఇలాంటి అసత్యపు వార్తలను మీరు కనుక ఇతరులకు షేర్ చేస్తే అది కూడా పెద్ద ఎత్తున నేరంగా మారి మీరు కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యంతకరమైన వీడియోలను షేర్ చేయకూడదు. అది నేరంగా పరిగణిస్తారు. నేరం. ద్వేషం, వివక్ష, రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయడం చట్టరీత్యా నేరం అందుకే సోషల్ మీడియాలో కాలక్షేపం చేసేవారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.