బీజేపీ ఆటలు ఆంధ్రాలో సాగటం లేదా..? జగన్, బాబు భారీ ఎత్తుగడ

somu veerraju bjp

 తెలంగాణలో అనూహ్యంగా తెరమీదకు దూసుకొచ్చి, వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది. ఎప్పుడు మూడో, నాలుగో స్థానంలో ఉండే పార్టీ నేడు మొదటి స్థానం కోసం పోటీపడే స్థాయికి చేరుకోవటం వెనుక ఆ పార్టీ దూకుడే ప్రధాన కారణమని చెప్పాలి. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి దూకుడైన నేతలు ముందుండి పార్టీని నడిపిస్తున్నారు.

somu veerraju bjp

 అలాంటి దూకుడును ఆంధ్రాలో చూపించి అక్కడ కూడా రెండో స్థానంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కానీ ఎలాంటి ఫలితం ఉండటం లేదు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం రెచ్చకొట్టటం, రెచ్చి పోవటం.. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నేతృత్వంలో రెచ్చ‌గొట్టే వ్యూహాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేశారు. బీజేపీ ట్రాప్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు మీడియా కూడా ప‌డింది. దీంతో బీజేపీ ప‌ని సులువైంది.

కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ఎంత‌గా రెచ్చ‌గొడుతున్నా రెచ్చిపోవ‌డానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలైన వైసీపీ, టీడీపీ సిద్ధంగా లేవు. ఇందుకు కార‌ణాలు ఏవైనా కావ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త రెండు రోజులుగా తిరుప‌తి కేంద్రంగా వైసీపీ, టీడీపీల‌పై బీజేపీ ఘాటైన విమ‌ర్శ‌లు చేసింది. కానీ బీజేపీ విమ‌ర్శ‌ల‌కు వైసీపీ, టీడీపీ నుంచి ఎలాంటి స్పంద‌నా లేదు. దీంతో బీజేపీలో అంత‌కంత‌కూ అస‌హ‌నంగా పెరుగుతోంది.

టీడీపీ, వైసీపీ మ‌త‌త‌త్వ రాజ‌కీయాలు చేస్తున్నాయి. టీడీపీ హ‌యాంలో ఎన్నో దేవాల‌యాలు ప‌డ‌గొట్టారు. ఇప్పుడు వైసీపీ హ‌యాంలో దేవాల‌యాల‌తో పాటు దేవీదేవ‌త‌ల విగ్ర‌హాలపై దాడులు జ‌రుగుతున్నా ఏమీ తెలియ‌న‌ట్టు ఉంటున్నారు. అధికారంలో ఉండగా విజయవాడలో 40 ఆలయాలకు పైగా కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు.

cbn and cm jagan

 మత రాజకీయాలు నెరిపే చంద్రబాబు నిద్రలేచినప్పుడల్లా నేను హిందువునని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంటారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి సొంత జిల్లాను అభివృద్ధి చేయలేని అసమర్థుడు. తెలంగాణలో ఒక సర్జికల్‌ స్ట్రైక్‌ కావాల్సి వస్తే ఏపీలో రెండు నిర్వహించాల్సిన అవసరం ఉంది”వైసీపీ స‌ర్కార్ మొద‌టి ఆరు నెల‌ల్లోనే రూ.55 వేల కోట్లు అప్పులు చేసింది. అక్ర‌మ‌, అనైతిక విధానాల‌ను ప్రోత్స‌హించ‌డంతో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుప‌డింది. పారిశ్రామిక‌వేత్త‌లు పారిపోయేలా ఏపీ ప్ర‌భుత్వం చేస్తోంది. కేంద్రం నిధులు సాయం చేస్తుంటే జ‌గ‌న్ త‌న‌పేరు పెట్టుకుని మాయ చేస్తున్నారు. ఇళ్ల స్థ‌లాల కోసం భూసేక‌ర‌ణకు ఖ‌ర్చు చేసిన రూ.7 వేల కోట్ల‌లో రూ.3 వేల కోట్ల అవినీతి జ‌రిగింది”

ఈ విధంగా బీజేపీ నేతలు అటు వైసీపీ మీద, ఇటు టీడీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న కానీ ఆ రెండు పార్టీలు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. తమ‌ను తిట్టండ్రా బాబూ అని వేడుకుంటున్నా, ఆ రెండు పార్టీలు కనీసం బీజేపీ మాటలను లెక్కలోకి కూడా తీసుకోకుండా సరైన ఎత్తుగడ అమలుచేస్తున్నారు. దీనితో బీజేపీ నేతలకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. తెలంగాణ లో మాదిరి సీఎం, ప్రతిపక్ష పార్టీలు తమపై విమర్శలు చేస్తే వాటినే తమ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని చూస్తున్న బీజేపీ పప్పులు ఆంధ్రాలో ఉడకటం లేదు..