ఆ హీరో వల్ల నేలపై పడుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఏమైందంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు భాషతో సంబంధం లేకుండా దేశవిదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్ సినిమా అంటే అభిమానులు సైతం ఎంతగానో ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే అతికొద్ది మంది హీరోలలో రజినీకాంత్ ఒకరు. రజనీకాంత్ స్టైల్ కు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అవుతారనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ కు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి.

అయితే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండే అతికొద్ది మంది హీరోలలో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ సింపుల్ గా ఉంటారని తెలిసినా ఏ స్థాయిలో సింపుల్ గా ఉంటారో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ కావాల్సిందేనని చెప్పవచ్చు. రజనీకాంత్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో దళపతి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అరవిందస్వామి కూడా కీలక పాత్రలో నటించారు.

ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత అరవిందస్వామి రజనీకాంత్ గది అని తెలియక ఆ గదిలోకి వెళ్లి మంచంపై నిద్రపోయారు. ఏసీ ఆన్ లో ఉండటంతో ఆ గదిలో అరవిందస్వామికి నిద్ర బాగా పట్టింది. అయితే అరవిందస్వామి ఉదయం నిద్ర లేచే సమయానికి అదే గదిలో రజనీకాంత్ నేలపై నిద్రిస్తూ కనిపించారు. రజనీకాంత్ ను నేలపై చూసిన అరవిందస్వామి టెన్షన్ పడటంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు.

రజనీకాంత్ ను అలా చూసిన అరవిందస్వామికి నిద్రమత్తు వదిలింది. ఆ తర్వాత అరవిందస్వామి యూనిట్ సభ్యులను కలవగా రజనీ సార్ మిమ్మల్ని గదిలో చూసి అతనిని లేపొద్దని అక్కడే పడుకోనివ్వండని చెప్పి నేలపై పడుకున్నారని వాళ్లు చెప్పడంతో ఆయన షాక్ కు గురయ్యారు. రజనీకాంత్ గొప్పదనం గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.