AP: గేమ్ ఛేంజర్ వేడుక ఓ పండుగా లాంటిది… మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు!

AP: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలోని సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈ సినిమా వేడుక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..
గేమ్ ఛేంజర్ సినిమా వేడుక మెగా అభిమానులకు ఒక పండుగ అంటూ మాట్లాడారు.మెగా హీరో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని తెలిపారు. సుమారు గంట పాటు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు.

ఇదొక మెగా హీరో సినిమా కావడం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అందుకే కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక ఈ వేడుకకు సుమారు లక్ష వరకు అభిమానులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకు అనుకూలంగానే ఏర్పాట్లను కూడా చేసినట్లు తెలియజేశారు. అభిమానులకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని ఈయన అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

ఇటీవల హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరుగుతున్న అతిపెద్ద సినిమా వేడుక కానున్న నేపథ్యంలో ఈ వేడుక ఏర్పాట్లను ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తూ కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు. ఇక ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.