Kiran Kumar Reddy: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఎంతో ఆసక్తికరంగా వివాదాస్పదంగా ఉంటాయి. ఇక ఏపీ రాజకీయాల విషయానికి వస్తే ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ అనే విధంగా మాత్రమే రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ మరో పార్టీ అవకాశం లేకుండా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయాలు ముందుకు సాగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమాధి అయిందని చెప్పాలి. ప్రస్తుతం వైయస్సార్ కుమార్తె షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న ఆమె కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేసే విషయంలో ఏమాత్రం బాధ్యత వహించలేదని తెలుస్తోంది.
షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉంటూ కేవలం తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయటానికే సమయం సరిపోతుంది తప్పా సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పార్టీని మరింత పటిష్టం చేయడానికి ఏమాత్రం కృషి చేయలేదని తెలుస్తోంది దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ బాధ్యతలను మరొకరికి అప్పగించబోతున్నట్టు సమాచారం. మరి కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టే ఆ నేత ఎవరంటే ఆయన మరెవరో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మూడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని తెలుస్తోంది.
వైయస్సార్ మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు మూడు సంవత్సరాల పాటు కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈయన కుటుంబానికి రాజకీయాలకు ఎంతో మంచి అనుబంధము ఉంది. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలోకి వెళ్లారు. గత ఎన్నికలలో రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసిన ఈయన గెలుపొందలేకపోయారు. ఈయన కేవలం బిజెపిలో ఉంటున్నారనే మాటే కానీ బీజేపీ నాయకులను కలవాలి అంటే అపాయింట్మెంట్ కూడా దొరకని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని త్వరలోనే ఈయన ఏపీలో పార్టీ పగ్గాలు అందుకోబోతున్నారని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని ఆకట్టుకోవాలి అంటే కాంగ్రెస్ అధినేత కూడా రెడ్డి ఉండాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు వైసిపి లోకి చేరటానికి ఇష్టం లేకుండా అటు కూటమిలో చేరటానికి ఇష్టం లేకుండా ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడానికి ఇదే అనువైన సమయం కావడంతో కాంగ్రెస్ పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డికి పిలుపు చేరవేసారని తెలుస్తోంది.